- Advertisement -
జూనియర్ వైద్యురాలి హత్యాచార సంఘటనపై దర్యాప్తులో పోలీస్‌లు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొట్టివేశారు. తమ ప్రభుత్వాన్ని అపనిందల పాలు చేసే ప్రయత్నం జరుగుతోందని, బాధితురాలి తల్లిదండ్రులకు తామెప్పుడూ డబ్బు ఇవ్వలేదని మమతా బెనర్జీ వివరించారు. ఒక నిండు జీవితాన్ని డబ్బు ఎప్పటికీ భర్తీ చేయలేదని పేర్కొన్నారు. వారి కుమార్తె జ్ఞాపకార్ధం ఏదైనా మంచిపని చేయాలనుకుంటే తమ ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చానని చెప్పారు. ఈ విషయంలో వారెప్పుడైనా తనను సంప్రదించవచ్చని దీదీ పేర్కొన్నారు.
- Advertisement -