కోల్ కతా: పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ ఎన్నికల పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో దీదీ కాలుకు గాయం అయ్యినట్లు తెలుస్తోతంది. దీంతో మమత తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని తిరిగి కోల్ కత్తా వెళ్లిపోయారు. ‘నందిగ్రామ్ లో భద్రత ఏర్పాట్లు సరిగా లేవు.రియాపాడ శివాలయం నుంచి బయటకు వస్తుండగా నలుగురైదుగురు దుండగలు దాడి చేశారు. నా పర్యటన సమయంలో ఒక్క పోలీసు కూడా లేడు’ అని దీదీ ఆరోపణలు చేసింది. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి, టిఎంసి పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో రెండు పార్టీల వర్గాలు పోటా పోటీగా ప్రచారాలతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ క్రమంలో నందిగ్రామ్ లో పర్యటిస్తున్న సిఎం మమతపై దాడి జరగడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
CM Mamata Banerjee injured in Nandigram Campaign