Saturday, December 21, 2024

ఇవిఎంల హ్యాకింగ్‌కు బిజెపి కుట్ర

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : వచ్చే లోక్‌సభ ఎన్నికలలో గెలుపు కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమత బెనర్జీ విమర్శించారు. ఇవిఎంల హ్యాకింగ్‌కు తగు విధంగా ఇప్పటి నుంచే బిజెపి అన్ని విధాలుగా సాంకేతిక ఏర్పాట్లకు దిగిందని , తగు సాక్షాధారాలు తమకు దక్కాయని తెలిపారు. మిగిలిన పూర్తి సమాచారం కూడా తాము రాబట్టుకుంటున్నామని, త్వరలోనే దీనిపై తగు విధంగా సమాచారం అందిస్తామని రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో తెలిపారు.

బిజెపికి ఇప్పుడు ఇండియా భయం పట్టుకుందని , తదుపరి ప్రభుత్వం ప్రతిపక్ష కూటమి ఇండియాదే అన్నారు. పతనం, మత ఉద్రిక్తతలు, ముప్పులు, నిరుద్యోగం బారి నుంచి ఇండియా దేశాన్ని రక్షించి తీరుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికలల్లో గెలిచేందుకు బిజెపి నానాపాట్లు పడుతోందని, ఇప్పుడు ఇవిఎంల హైజాక్‌కు సిద్ధం అవుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News