- Advertisement -
బర్ధమాన్ (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుదుటికి గాయం అయింది. బుధవారం బర్ధమాన్‌లో మరొక వాహనాన్ని ఢీకొనకుండా చూసే యత్నంలో ఆమె కారును అకస్మాత్తుగా ఆపడంతో ఆమె తలకు గాయం అయిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
కారులో డ్రైవర్ పక్కనే కూర్చున్న మమత తల కారు అద్దానికి తగలడంతో ఆమె గాయపడినట్లు ఆయన తెలిపారు. మమతను వెంటనే కోల్‌కతాకు తిరిగి తీసుకువచ్చారని, ఆమెకు వైద్యులు చికిత్స చేశారని అధికారి చెప్పారు. పరిపాలన యంత్రాంగం సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించేందుకు మమత బుధవారం మధ్యాహ్నం పూర్వ బర్ధమాన్‌కు వెళ్లారు.
- Advertisement -