Wednesday, January 22, 2025

హర్యానాలో హింసాకాండ.. దోషులపై కఠిన చర్యలు : సిఎం మనోహర్‌లాల

- Advertisement -
- Advertisement -

చండీఘడ్ : హర్యానాలో మతఘర్షణల నేపథ్యంలో హింసాకాండకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామని , దోషులను ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. హింసకు పాల్పడిన 116 మందిని అరెస్ట్ చేశామని, 90 మందిని నిర్బంధం లోకి తీసుకున్నామని చెప్పారు. నుహ్‌లో స్పెషల్ బెటాలియన్‌ను రంగం లోకి దింపామని చెప్పారు. బాధితులకు పరిహారం చెల్లిస్తామన్నారు.

సీఆర్‌పిఎఫ్ బలగాలను మోహరించామని , సిసిటీవి ఫుటేజ్‌ను పోలీస్‌లు పరిశీలిస్తున్నారని చెప్పారు. బజరంగ్‌దళ్ నేత మనేసర్ ఎక్కడున్నారో వివరాలు వెల్లడి కాలేదని, అల్లర్లలో మోను మనేసర్ ప్రమేయం ఉంటే ఆ దిశగా విచారణ సాగుతుందని తెలిపారు. హర్యానా అల్లర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గురుగ్రాంలో మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగడంతో ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్ ) అప్రమత్తమైంది. గురుగ్రాం సోహ్న సబ్‌డివిజన్‌లో అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News