Wednesday, January 22, 2025

ఈ నెల 16వ తేదీన కలెక్టర్లు, ఎస్పిలతో సిఎం సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జులై 16వ తేదీన కలెక్టర్లు, ఎస్పిలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో సమావేశమవుతారు. ఈ నెల 16న సచివాలయంలో కలెక్టర్లు, సిపిలు, ఎస్పిల సమావేశం కానున్నారు.

ప్రజా పాలన, ధరణి సమస్యలు, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం,
మహిళా శక్తి, విద్య, లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, సిపిలు, ఎస్పీిలు సంబంధిత సమాచారంతో సమావేశానికి హాజరు కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News