Thursday, January 16, 2025

గుకేశ్ కు రూ.5 కోట్ల నగదు ప్రకటించిన సిఎం స్టాలిన్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ చెస్ ఛాంపియన్ సాంధించిన పిన్న వయస్కుడిగా కీర్తి గడించిన డి. గుకేశ్ కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఐదు కోట్ల రూపాయల నగదు బహుమతిని శుక్రవారం ప్రకటించారు. చెన్నై కి చెందిన గ్రాండ్ మాస్టర్ గుకేశ్ గురువారం ప్రపంచ చెస్ ఛాంపియన్ సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా కీర్తి గడించాడు. అతడి వయస్సు 18 ఏళ్లే. సింగపూర్ లో జరిగిన పోటీలో అతడు చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను చివరిదైన 14వ గేమ్ లో ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు. అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ @గుకేశ్ స్మారక విజయాన్ని పురసరించుకుని, నేను రూ. 5 కోట్ల నగదు బహుమానాన్ని ప్రకటిస్తున్నాను’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు.

‘అతడి చారిత్రక విజయం దేశానికి కీర్తిని, సంతోషాన్ని తెచ్చింది. భవిష్యత్తులో అతడు మరింత సాధించొచ్చు’ అని పేర్కొన్నారు. తన కెరీర్ లో ఐదు సార్లు ఛాంపియన్‌షిప్ సాధించిన దిగ్గజ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గణనీయ పురస్కారాన్ని సాధించిన రెండో భారతీయుడు గుకేశ్ . చెస్ పోటీలో చైనా క్రీడాకారుడు 6.5 పాయింట్లు సాధిస్తే, గుకేశ్ 7.5 పాయింట్లు సాధించాడు. అది కూడా 14వ, చివరి క్లాసికల్ టైమ్ కంట్రోల్ గేమ్‌లో గెలిచాడు. చాలా వరకు ఆ గేమ్ డ్రా దిశగానే నడిచింది. విజేతకు 2.5 మిలియన్ అమెరికన్ డాలర్ల పర్సులో 1.3 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 11.03 కోట్లు) దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News