Wednesday, January 22, 2025

బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసమే దర్యాప్తు సంస్థల దాడులు: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై : కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆరోపించారు. డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఇళ్లపై ఐటీ సోదాలు చేస్తున్న తరుణంలో సీఎం స్పందించారు. డీఎంకే ఎంపీకి చెందిన ఆఫీసులు, నివాసాల్లో కలిపి 40 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను అదుపు లోకి తీసుకోవడాన్ని ప్రశ్నిస్తూ స్టాలిన్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న ఐక్యత పట్ల బీజేపీ భయపడుతోందని, వారి మంత్రగత్తవేట ( దర్యాప్తు సంస్థలు ) ఆపేసి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News