Wednesday, April 16, 2025

రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు కురియన్ కమిటీ

- Advertisement -
- Advertisement -

చెన్నై: రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె సా లిన్ నిర్ణయించారు. రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధించిన ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసఫ్ ఆధ్వర్యం వహిస్తారు. ముగ్గురు సభ్యుల కమిటీ లో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్థన్ షెట్టి, ఆర్థికవేత్త ఎం నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారంనాడు సిఎం స్టాలిన్ ఈ ప్రకటన చేశారు. రా ష్ట్రాల హక్కులను కాపాడడానికి, భారతదేశపు ఫెడరల్ వ్యవ స్థ నిర్మాణాన్ని తిరిగి సమతుల్యం చేసే చర్యలను సమీక్షించడంతో పాటు తగిన సిఫార్సులు చేసేందుకు ఈ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాల రాజ్యాంగ పరమైన అధికారాలను పదేపదే ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు దక్కవలసిన హక్కులను కల్పించడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను పెంపొందించడానికీ ఈ కమిటీ కృషి చేస్తుందని స్టాలిన్ అన్నారు. కమిటీ కి సుప్రింకోర్టు మాజీ జడ్జి కురియన్ జోసెఫ్ ఆధ్వర్యంవహిస్తారు. ఇక మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్థన్ షెట్టి , ఆర్థికవేత్త ఎం నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. అశోక్ వర్థన్ షెట్టి సమర్థుడైన పాలనాదక్షుడుగా పేరుపొందారు.

గతంలో డిఎంకె ప్రభుత్వంలో స్టాలిన్ తోపాటు కలిసి పనిచేశారు. ఇక నాగనాథన్ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు తోపాటు పలు కీలక పదవులు నిర్వహించారు. స్టాలిన్ తోపాటు, దివంగత సీఎం కరుణానిథితో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. డిఎంకె ఆధ్వర్యంలోని తమిళనాడు ప్రభుత్వం, మోదీ నాయకత్వంలోని కేంద్రం మధ్య ఇటీవల పలు అంశాలపై పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది.ముఖ్యంగా కేంద్రం కొత్తవిద్యావిధానం, పన్నులు, ఆర్థిక పరమైన వికేంద్రీకరణ, సంస్థాగత స్వయం ప్రతిపత్తి వంటి అంశాలలో ఇటీవల పొరపొచ్చాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం కీలకమైన సంస్థలను, విధానాలను, ఆర్థికపరమైన సాధనాలనూ అధికార కేంద్రీకరణ కోసం వినియోగిస్తోందని, ఈ నేపథ్యంలో తరచు రాష్ట్రాల ముఖ్యంగా ప్రతిపక్షపార్టీల ఆధ్వర్యంలోని ప్రభుత్వాల అధికారాలను నిర్లక్ష్యం చేయడమో, ఆ రాష్ట్రాలను బలహీన పరచడమో చేస్తోందని ఆయన ఆరోపణల ద్వారా వ్యక్తమైంది.

1969లో రాజమన్నార్ కమిటీ
కేంద్ర -రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసేందుకు జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం సర్కారియా కమిషన్, పాంచీ కమిషన్ లను ఏర్పాటు చేయడానికి ముందే 1969లో రాజమన్నార్ కమిషన్ ను ఏర్పాటు చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి ప్రయత్నాలను స్టాలిన్ గుర్తుచేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News