Thursday, April 10, 2025

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా జేఏసి ఏర్పాటు:సిఎం స్టాలిన్

- Advertisement -
- Advertisement -

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు సిఎం, డిఎంకే చీఫ్ స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 7 రాష్ట్రాల సిఎంలు, పార్టీల అధినేతలకు సిఎం స్టాలిన్ లేఖలు రాశారు. కేంద్రం డీలిమిటేషన్ ప్రవేశపెడితే తమ హక్కుల్ని కాలరాస్తాయని, రాష్ట్రాల్లోని ఎంపి సీట్లు తగ్గుతాయని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జనాభా నియంత్రణలో మెరుగ్గా వ్యవహారించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని స్టాలిన్ పేర్కొంటున్నారు. అందులో భాగంగా డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా జాయింట్ యక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. అందులో భాగంగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, కేరళ సిఎం పినరయి విజయన్, ఎపి సిఎం చంద్రబాబు,

ఒడిశా సిఎం మోహన్ చరణ్ మాఝీ, పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీల, కర్ణాటక సిఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సిఎం ఎన్ రంగ స్వామిలను ఆహ్వానించారు. అదేవిధంగా వైఎస్‌ఆర్‌సిపి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, తెలంగాణ, ఎపి కాంగ్రెస్, టిడిపి, జనసేన చీఫ్, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. మార్చి 22వ తేదీన చెన్నైలో మొదటి జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు స్టాలిన్ ఆ లేఖలో తెలిపారు. వీరంతా జేఏసిలో చేరాలని, పార్టీలోని ముఖ్య నేతలను ప్రతినిధులుగా ఈ సమావేశానికి పంపాల్సిందిగా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News