హైదరాబాద్‌లో జెఎసి
రెండవ భేటీ ఆలోగా
మరిన్ని రాష్ట్రాలు మాతో
చేరవచ్చు తెలంగాణ
అసెంబ్లీ తీర్మానం ఒక
మైలురాయి రేవంత్ తన
మాటలను చేతల్లో
చూపించారు: సిఎం స్టాలిన్
మన తెలంగాణ/హైదరాబాద్ : నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ శాసనసభలో ఒక ముఖ్యమైన మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసి సిఎం రేవంత్‌రెడ్డి తన మాటలను చేతల్లో నిరూపించారని తమిళనాడు సిఎం స్టాలిన్ కొనియాడారు. జ నాభా ప్రాతిపదికన పునర్విభజనను వ్యతిరేకిస్తూ సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ శాసనసభ గురువారం తీర్మా నం చేసిన నేపథ్యంలో తమిళనాడు సిఎం ఎక్స్ వేదికగా స్పందించారు. న్యాయం, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తిని సమర్థిస్తూ సరైన రీతిలో పునర్విభజన కోరుతూ సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభలో తీర్మా నం చేశారని స్టాలిన్ పేర్కొన్నా రు.
చెన్నైలో ప్రతిపాదించిన అంశాలు హైద రాబాద్‌లో నెరవేరాయని వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమే అని, హైదరాబాద్‌లో ఐక్యకార్యాచరణ సమితి రెండో సమావేశం నేపథ్యంలో మరిన్ని రాష్ట్రాలు అదే బాటలో నడుస్తాయని స్టాలిన్ అశాభావం వ్యక్తం చేశారు. పునర్విభజన విషయంలో తమిళనాడును అనుసరిస్తూ, ఈ చర్య మన ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా ప్రతిఘటించే సమష్టితత్వాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. భారతదేశ భవిష్యత్తును అధర్మ మార్గాన ఒక ప్రాంతానికి అన్యాయం చేసే రీతిన రాసేందుకు ప్రయత్నించే ఎవరినీ అనుమతించబోమని స్టాలిన్ స్పష్టం చేశారు.