Friday, November 22, 2024

ఆ చిన్నారులకు నెలకు రూ.1500: బీహార్ సర్కార్

- Advertisement -
- Advertisement -

CM Nitish Kumar announces scheme for children

పాట్నా: కరోనా వైరస్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీహార్ ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం ప్రకటించారు. “బాల్ సహాయతా యోజనా” పేరుతో ఓ కొత్త పథకం ప్రారంభించినట్టు  నితీష్ కుమార్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్ వల్ల పేరెంట్స్ కోల్పోయిన పిల్లలకు 18ఏళ్ల వచ్చేవరకు రూ.1500 సాయం అందిస్తామని హిందీలో ట్వీట్ చేశారు. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయిన ఈ పథకం వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. సామాజిక-ఆర్ధికంగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలను ప్రాధాన్యతతో విద్యావంతులను చేయడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న మాధ్యమిక పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల నివాస పాఠశాలలో బాలికలను చేర్చుకుంటామని ఆయన చెప్పారు.

CM Nitish Kumar announces scheme for children

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News