Sunday, December 22, 2024

నితీశ్ ఇండియా భేటీకి వెళ్లరు.. ఎన్‌డిఎ గూటికొస్తారు: అథవాలే

- Advertisement -
- Advertisement -

మూంబై : బీహార్ సిఎం, జెడియు నేత నితీశ్‌కుమార్ తమ వాడని, ఆయన ఎప్పుడైనా ఎన్‌డిఎకు తిరిగి రావచ్చునని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలే చెప్పారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత సహాయ మంత్రి అయిన రాందాస్ ఆదివారం ఓ వార్తాసంస్థకు ఇంటర్వూ ఇచ్చారు. బీహార్‌కు శనివారం పలు కేంద్ర సంక్షేమ పథకాల ప్రారంభానికి వెళ్లి ముంబై చేరుకున్న తరువాత ఆయన పాట్నాలో చెప్పిందే తిరిగి ఘంటాపథంగా తెలిపారు. నితీశ్ త్వరలోనే ఎన్‌డిఎలో చేరడం ఖాయం అన్నారు. . ఈ సందర్బంగా ఈ మంత్రి మాట్లాడుతూ ‘నితీశ్ హమారే హై …హమారే పాస్ కభీ ఆసాక్తే హై ( నితీశ్ మాలో ఒక్కరు, ఎప్పుడైనా తిరిగి మా గూటికి చేరవచ్చు) అన్నారు.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీప్ అయిన రాందాస్ నితీశ్‌పై ప్రశంసలు కురిపించారు. ఇప్పటికీ ప్రతిపక్ష సమావేశం తేదీలు ఖరారు కాని స్థితి ఉందని అథవాలే తెలిపారు. ఈ సంగతి తనకు అవసరం లేదని, అయితే తమ పాత మిత్రులు నితీశ్ తిరిగి తమ వేదికకు చేరుకోవడం గురించి తాను చెపుతున్నానని , ఆయన పార్టీ ఇంతకు ముందు ఎన్‌డిఎలో భాగస్వామ్య పక్షంగా ఉందన్నారు.తాను ఒక్కరోజు క్రితం పాట్నాకు వెళ్లినప్పుడు అన్ని విషయాలను స్థూలంగా పరిశీలించినట్లు, ప్రతిపక్ష కూటమి నేతల వైఖరితో నితీశ్ విసుగుచెందారని, కూటమి కన్వీనర్ ఎవరు? ప్రధాని అభ్యర్థి ఎవరు? అనేదానిపై నితీశ్ ఇతరులతో విభేదించారని, అందుకే బెంగళూరులో భేటీ నుంచి ఆయన ముందుగానే వచ్చేశారని, ఇక ముందు జరిగే భేటీకి వెళ్లకపోవచ్చునని, వెళ్లకుండా ఉంటేనే బాగు అని నితీశ్‌కు చిరకాల మిత్రుడైన అథవాలే తెలిపారు.

నితీశ్‌కు ఎన్‌డిఎ దర్వాజా బంద్.. వస్తానన్నా రానివ్వంః సుశీల్ మోడీ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు ఎన్‌డిఎ తలుపులు ఎప్పుడో మూసి వేశారని బిజెపి ఎంపి సుశీల్ కుమార్ మోడీ ఆదివారం స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తరచూ నితీశ్ త్వరలోనే ఎన్‌డిఎలోకి వస్తారని చెప్పడంపై మాజీ ఉపముఖ్యమంత్రి అయిన సుశీల్ మోడీ స్పందించారు. బహుశా అది ఆయన ( కేంద్ర మంత్రి) వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండవచ్చు. అయితే నిజం ఒక్కటే అని, బిజెపి ఇక నితీశ్‌ను దగ్గరికి కూడా రానివ్వబోదన్నారు. ఆయన వస్తానన్నా మేం కాదంటామన్నారు. ఏది ఏమైనా రాందాస్ అథవాలే బిజెపి ప్రతినిధి కాదని, ఎన్‌డిఎ తరఫున మాట్లాడే హోదాలేదని స్పష్టం చెశారు. వ్యక్తిగత స్థాయిలో ఏదో చెప్పి ఉంటారని పాట్నాలో విలేకరుల సమావేశంలో సుశీల్ మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News