Sunday, December 22, 2024

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు : సిఎం నితీశ్ కుమార్ జోస్యం

- Advertisement -
- Advertisement -

నలందా: ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. మంగళవారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని సోమవారం నాడు కోల్‌కతాలో వ్యాఖ్యానించారు. మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలపై నితీశ్ తాజాగా స్పందిస్తూ ఎన్డీయే ముందస్తుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, గత ఆరేడు నెలలుగా తాను చెబుతున్నానని అన్నారు. కాలక్రమేణా విపక్షాల ఐక్యత వల్ల నష్టం జరుగుతుందని ఎన్‌డిఎ భయపడుతోందన్నారు. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు వ్యక్తిగతమైన ఆకాంక్షలేవీ లేవని మరోసారి చెబుతున్నానని,

వీలైనంత వరకు ఎక్కువ సంఖ్యలో విపక్షాలను ఎన్నికల ముందు ఏకం చేయాలన్నదే తన ఏకైక అభిలాషగా ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 31. సెప్టెంబర్1న ముంబైలో విపక్షాల సమావేశాల తరువాత ‘ఇండియా’కూటమి మరింత బలోపేతం అవుతుందన్నారు. నలందా ఓపెన్ యూనివర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా నితీశ్ విలేఖరులతో మాట్లాడారు. కులగణనపై మాట్లాడుతూ ఈ కసరత్తు పూర్తి కావచ్చిందని, త్వరలో ప్రచురించడమౌతుందని చెప్పారు. తుది డేటా సమాజం లోని వివిధ వర్గాల ముఖ్యంగా అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కులాల ఆధారంగా సర్వే చేయాలన్నది బీజేపీతోసహా వివిధ పార్టీల ఏకగ్రీవ అంగీకారంగా పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణలో కేంద్రం ఎందుకు మౌనం వహిస్తుందో తెలియడం లేదని, ఈ ఎక్సర్‌సైజ్ 2021నాటికి పూర్తి కావలసి ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News