Friday, January 24, 2025

సిఎం నితీశ్ కుమార్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

పాట్నా: బిహార్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కు అందించారు. నితీశ్ మీడియాతో మాట్లాడుతూ సిఎం పదవికి రాజీనామా చేశానని చెప్పారు. మళ్లీ బిజెపితో కలిసి జెడియు అధినేత నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నితీశ్ కుమార్ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్టు సమాచారం. ఆర్ జెడితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఆ బంధాన్ని తెంచుకొని మళ్లీ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బిజెపి ఎంఎల్ఎలు నితీశ్ కుమార్ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటంచడంతో పాటు లేఖను విడుదల చేశారు. అటు బిజెపి ఎంఎల్ఎలు, ఇటు జెడియు ఎంఎల్ఎలు తన పార్టీ ఆఫీసు కార్యాలయంలో సమావేశమయ్యారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జెడియు నేత నీరజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పాదయాత్రలో భాగంగా ఆయన ఎక్కడకు వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తుండడంతో ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇండియా కూటమి నుంచి మిత్రపక్షాలు ఎందుకు దూరమవుతున్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

బిజెపి ఎంఎల్ఎ మోతీలాల్ ప్రసాద్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జెడియుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై బిజెపి అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం లేదని వ్యాఖ్యనించారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు.

బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 122 స్థానాలు కావాలి. బిజెపి-జెడియు కలిసి 123 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బిజెపిికి హెచ్ ఎఎం పార్టీ మద్దుతు కూడా ఇస్తుండడంతో ఈ కూటమి సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

ఆర్ జెడి: 79

బిజెపి: 78

జెడియు: 45

హెఎఎం: 04

కాంగ్రెస్: 19

సిపిఐఎంఎల్: 12

సిపిఐ: 02

సిపిఎం: 02

ఎఐఎంఐఎం: 01

ఐఎన్డి: 01

మొత్తం: 243

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News