Friday, December 20, 2024

బీహార్‌లో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కోటా పెంపు?

- Advertisement -
- Advertisement -

ఈ సెషన్‌లోనే 65 శాతం చేస్తామన్న సిఎం నితీశ్

పాట్నా : బీహార్‌లో ఇప్పుడు ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు ఉన్న నిర్ధేశిత రిజర్వేషన్ల కోటాను పెంచనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో స్వయంగా తెలిపారు. ఈ వర్గాల రిజర్వేషన్ల కోటాను పెంచాలనేది తమ ప్రభుత్వ నిర్ణయం అని, ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌లో బిల్లు తీసుకురావడం జరుగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం కులాల వారి జనగణనను నిర్వహించింది. సంబంధిత నివేదికపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సిఎం నితీశ్‌కుమార్ పాల్గొన్నారు.

ఇప్పుడు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఉన్న మొత్తం మీది 50 శాతం కోటాను 65 శాతానికి పెంచాల్సి ఉందని తాము గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. ఇందులో ఎస్‌టి, ఎస్‌సిలకు కలిపి ఉన్న 17 శాతం రిజర్వేషన్లను 22 శాతానికి పెంచితేనే సామాజిక న్యాయం జరుగుతుందని తాము భావిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు తమ ప్రభుత్వం శాసన, చట్ట, న్యాయపరమైన చర్యలకు దిగుతుందని అసెంబ్లీలో తెలిపారు. అయితే ముందుగా సంబంధిత విషయంపై అవసరం అయిన సంప్రదింపులు జరుగుతాయని , వెంటనే ప్రస్తుత సెషన్‌లోనే కోటా పెంపుదలకుదిగడం జరుగుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News