Wednesday, January 22, 2025

ఏకంగా సిఎం కార్యాలయమే ఓకే అందిగా!.. కుమారీ ఆంటీ ఇప్పుడు ఖుష్!

- Advertisement -
- Advertisement -

స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం ఉన్నవారికి కుమారి ఆంటీ పేరు తెలిసే ఉంటుంది. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ జీవించే కుమారి ఆంటీ యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తూ, ఫేమస్ అయిపోయింది. అనేక యూ ట్యూబ్ ఛానెల్స్ ఆమెను ఇంటర్వూలు చేశాయి. దీంతో ఆమె నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నారు. ఆవిడ విక్రయించే వంటకాలు రుచికరంగా ఉండటంతో కుర్రకారు అక్కడ తినేందుకు క్యూ కడతారు. వారు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కు చేస్తుండటంతో రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు ఆటంకం కలుగుతోంది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుపై అమ్మడానికి వీల్లేదంటూ ట్రాఫిక్ పోలీసులు ఆమెను హెచ్చరించారు.

దీంతో కుమారీ ఆంటీ తాను నమ్ముకున్న సోషల్ మీడియానే మరొకసారి ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలంటూ వీడియోలు పోస్ట్ చేశారు. మీడియా వల్లనే తనకు పేరొచ్చిందనీ, ఇప్పడు కూడా మీడియానే తనకు సాయం చేయాలని ఆమె వేడుకున్నారు.

చివరకు కుమారీ ఆంటీ విన్నపాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. కుమారీ ఆంటీ అంగడిని అక్కడినుంచి తొలగించనక్కరలేదని, అక్కడే ఆమె తన వ్యాపారం కొనసాగించుకోవచ్చుననీ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News