Friday, December 20, 2024

రాజకీయ నేపథ్యంతో సందేశాత్మక చిత్రం ‘సీఎం పెళ్లాం’

- Advertisement -
- Advertisement -

జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సీఎం పెళ్లాం‘. ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు గడ్డం వెంకట రమణరెడ్డి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘సీఎం పెళ్లాం‘ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ “రాజకీయ నేపథ్యంతో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. మనం ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం చూశాం.

మా మూవీలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం. చాలా మంచి ప్రయత్నం చేశాం”అని అన్నారు. నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ “రాజకీయ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో మహిళా సాధికారత గురించి కూడా కంటెంట్ ఉంటుంది. సుమన్, ఇంద్రజ, అజయ్‌తో మూవీ చేయడం హ్యాపీగా ఉంది”అని తెలిపారు. సుమన్ మాట్లాడుతూ “-సీఎం పెళ్లాం సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. రొటీన్‌కు భిన్నమైన పాత్రలో కనిపిస్తా. చాలా మంచి స్క్రిప్ట్ ఇది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రజ, అజయ్, అలీ, స్వాతి, ఘర్షణ శ్రీనివాస్, సురేష్ కొండేటి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News