Sunday, November 24, 2024

గిన్నీస్ రికార్డుపై పాలుమూరు మహిళా సమాఖ్యలకు సిఎం ప్రశంస

- Advertisement -
- Advertisement -

CM praises women's associations over Guinness World Record

హైదరాబాద్ : సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న సాగునీటి జలాలతో నేడు ఎటు చూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నదన్నారు. బీడు భూములు రాల్లు గుట్టలకే ఇన్నాల్లూ పరిమితమై వున్న పాలమూరు పచ్చదనంతో తన రూపు రేఖలను మార్చుకుని, వినూత్న రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుండడం సంతోషకరమన్నారు. తెలంగాణకు హరిత హారం స్పూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడం, సీడ్ బాల్స్ తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్ బుక్ వరల్ రికార్డు” జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ చేతులమీదుగా ఎంపి జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అందుకున్నారు.

ఈ సందర్భంగా వారి కృషిని సిఎం కెసిఆర్ అభినందించారు. సీడ్ బాల్స్ తయారీలో సరికొత్త గిన్నీస్ రికార్డ్ నెలకొల్పిన మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగానికి, పాలమూరు మహిళా సమాఖ్యల కృషిని సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. గత ఏడాది నెలకొల్పిన 1.18 కోట్ల సీడ్ బాల్స్ తయారీ రికార్డును అధిగమించి ఈసారి కేవలం 10 రోజుల్లో 2 కోట్ల పది లక్షల సీడ్ బాల్స్‌ను ఒక నెల కాలంలో తయారు చేసి కొండలు గుట్టల ప్రాంతాల్లో వెదజల్లడం ఆనందంగా ఉందన్నారు. తద్వారా పచ్చదనం అభివృద్ధికి పాటుపడుతున్న వారందరిని సిఎం అభినందించారు. ఇదే స్పూర్తి, ఉత్సాహంతో మునుముందు కూడా శ్రమించి జిల్లాను సంపూర్ణ పచ్చదనంగా మార్చాలని సిఎం కెసిఆర్ అభిలాషించారు. జిల్లాలోని మారుమూల గ్రాములు కూడా పచ్చదనంతో కళకళలాడాలన్నారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పనిచేసి రాష్ట్రానికే గర్వకారణంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News