Thursday, January 23, 2025

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణా/జఫర్‌గడ్ : జనగామ జిల్లా జఫర్ గడ్ మండలంలోని తమ్మడపల్లి (జి) కి చెందిన ఎండి అబ్దుల్లా, రడపాక నితీశ్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.60 వేల విలువగల చెక్కులను మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హన్మకొండలోని ఆయన నివాసంలో శనివారం లబ్దిదారులకు అందచేశారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సిఎం సహాయనిధి వరంలా మారిందని కడియం పేర్కొన్నారు. కార్యక్రమంలో తమ్మడపల్లి (ఐ) సర్పంచ్ గాదెపాక అనిత సుధాకర్‌బాబు, సొసైటీ డైరెక్టర్ కొత్త సాంబరాజు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News