Monday, December 23, 2024

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులందించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

 

రాజంపేట: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని బస్వన్నపల్లి, ఆర్గోండ, కోండాపూర్, ఎల్లారెడ్డిపల్లి, గుండారం, సిద్దాపూర్ గ్రామాలకు చెందిన పలువురు లబ్దిదారులకు మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. బస్వన్న పల్లి గ్రామంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో బోరుమెటర్ ప్రారంభించారు.

అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఆనారోగ్యంతో మరణించిన బాదిత కుటుంబాలను అయన పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మండలంలో 23 మంది లభ్దిదారులకు సుమారు 12లక్షల విలువ గల సిఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు జడ్పిటీసి హన్మండ్లు ,ఎంపిపి స్వరూప కృష్ణముర్తి, మాజీ ఎంపిపి నీరుడి శంకర్, సర్పంచ్‌లు శ్రీజ రమేష్ రెడ్డి, లక్ష్మణ్, బీరయ్య, సత్తయ్య,ఎంపిటీసిలు సుమలత, హాజీనాయక్, సాగర్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News