Monday, December 23, 2024

నిరుపేదలకు అండగా సిఎం రిలీఫ్ ఫండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖిలా వరంగల్: నిరుపేద ప్రజలకు సిఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం 33వ డివిజన్‌కు చెందిన శైలజ అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారికి సిఎం సహాయ నిధి ద్వారా రూ. లక్ష చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు భారం కావద్దని ప్రభుత్వం నుంచి ఎల్‌ఒసి, వైద్యం చేయించుకున్న వారికి సిఎం సహాయ నిధి ద్వారా సాయం చేయడం జరుగుతుందన్నారు. పేదలకు వైద్యంలో ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని రూ. 1250 కోట్లతో 24 అంతస్తులతో సకల సదుపాయాలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నామని, అతి త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ మార్గనిర్దేశంలో తూర్ప నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ఎల్‌ఒసి, సిఎం సహాయ నిధి ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్ కార్పోరేటర్ కావటి కవితతో కలిసి దేశాయిపేట శాతావాహన రజక సొసైటీ ఆధ్వర్యంలో తమ ఆరాధ్య దైవమైన మడేలయ్య దేవాలయ అభివృద్ధికి శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యక్తిగతంగా మడేలయ్య దేవాలయాభివృద్ధికి రూ. 50 వేలు ఆర్థికసాయం అందించి రజకుల అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, సొసైటీ అధ్యక్షుడు చంద్రమౌళి, వేణు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News