- Advertisement -
హైదరాబాద్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని బురహాన్ పల్లి గ్రామ నివాసి జి.రమేష్ కు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన ఒక లక్షల రూపాయల బ్యాంకు చెక్కు ను హైదరాబాదు బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పంపిణీ చేశారు. సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తునదని అందులో భాగంగానే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిరుపేదలకు మెరుగైన వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సహాయం మంజూరు చేస్తున్నారని మంత్రి తెలిపారు. అంతే కాకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమం క్రింద కార్పొరేట్ ఆస్పత్రులలో ఉచితంగా వైద్య చికిత్స అందజేస్తున్నామని వివరించారు.
- Advertisement -