- Advertisement -
హైదరాబాద్: ఆపద సమయంలో ప్రభుత్వం బాధితుడికి అండగా ఉంటుందని దేవరకద్ర ఎంఎల్ఎ నిరూపించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2,50,000 రూపాయల విలువ గల ఎల్ఒసిని బాధితుడికి అందజేశారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో చిన్నచింతకుంట మండలం కురుమూర్తి గ్రామానికి చెందిన కె. శంకరమ్మ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె చికిత్స పొందుతుంది. 2,50,000 రూపాయల విలువ గల ఎల్ఒసి కాపీని బాధిత కుటుంబ సభ్యులకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆపద సమయంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలిచి ఆదుకుంటుందని తెలిపారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
- Advertisement -