Monday, December 23, 2024

సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరంలాంటిదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని కమలాపూర్ చౌరస్తాలోని ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం మంత్రి ఈశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.పట్టణంలోని ఎస్‌హెచ్ గార్డెన్‌లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మున్సిపల్ సిబ్బందికి శాలువలతో సత్కరించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందించారు.

ఈ సందర్బంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల అనారోగ్యం పాలైనటువంటి పేద ప్రజలకు సొంత ఖర్చులతో వైద్యం పొంది ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా సహాయం అందిస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ పేద ప్రజలకు కోసం ఎ న్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, పేద ప్రజల పాలిట ఆపద్బాందవుడిలా నిలుస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమర్ద పర్యవేక్షణలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు తెలంగాణ పట్టణాలను ప్రగతి పథంలో నిలుపుతున్నాయన్నారు. పట్టణాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే లక్షంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో తెలంగాణ పట్టణాలు తొమ్మిదేండ్లలోనే సరికొత్త రూపును సంతరించుకున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, జెడ్పీటీసీ సభ్యులు బత్తిని అరుణ, సుధారాణి, ఎఏంసి చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, ఎఎంసీ వైస్ చైర్మన్ అక్కనపెల్లి సునిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News