Monday, December 23, 2024

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

- Advertisement -
- Advertisement -
  • మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డుకు చెందిన ఒగ్గు సత్తమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆర్థిక సహాయార్థం ముఖ్యమంత్రి సహాయునిధికి దరఖాస్తు చేసుకుంది. కాగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 60 వేల చెక్కును తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారురాలు ఒగ్గు సత్తెమ్మకు స్థానిక కౌన్సిలర్ కౌడే మహేష్ తో కలిసి శుక్రవారం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని అన్నారు. మేడ్చల్ మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్ కౌడి మహేష్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది పేదలకు నాణ్యమైన వైద్యమందించి ఆదుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పాలిట ఆపద్బాంధవుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News