Sunday, December 22, 2024

సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

- Advertisement -
- Advertisement -

మరిపెడ: సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని, దానిని సద్వినియోగం చేసుకోవాలని బిఆర్‌ఎస్ మరిపెడ మండల పార్టీ అధ్యక్షులు రామసహాయం సత్యనారాయణరెడ్డి అన్నారు. ఆధివారం ఆయన మండలంలోని తానంచర్ల గ్రామానికి చెందిన పోలేపాక వెంకటమ్మకు మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రామసహాయం రంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు సహకారంతో మంజూరైన చెక్కును వెంకటమ్మకు అందించడం జరిగిందన్నారు.

అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్న పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సిఎం రిలీఫ్ ఫండ్ పేరిట ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు పాదూరి రాంచంద్రారెడ్డి, దిగజర్ల ముఖేష్, ఉప సర్పంచ్ దయ్యాల లింగస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు సీత వెంకన్న, సీత వీరభద్రం, వార్డు సభ్యులు సీత అంజి, మదార్, కొమ్ము నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News