Monday, December 23, 2024

సిఎం సహాయ నిది పేదలకు వరం

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధితులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పెబ్బేరు పట్టణ నివాసి వి. రాములు 14 వేలు, సి. కురుమన్నకు 20 వేల 500 రూపాయలు విలువ గల చెక్కులను అందజేశారు. మైనార్టీకి చెందిన ఎంఏ మజీద్‌కు 11 వేల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు బాధితుల సిఎం సహాయ నిధి చెక్కులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వనం రాములు, మైనార్టీ నాయకులు ఎండి మజీద్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు నజీర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News