- Advertisement -
మన తెలంగాణా/జఫర్గడ్ : జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన టిఆర్ఎస్ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎర్ర పెద్ద రాజుకు సిఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.25 వేల విలువగల చెక్కును స్థానిక సర్పంచ్ పొన్నాల జ్యోతి నాగరాజు, టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎర్ర నరేశ్ ఆధ్వర్యంలో బుధవారం బాధితునికి అందచేశారు. సిఎం సహాయనిధి పేదలకు వరంలా మారిందని ప్రశంసించారు. ఉప సర్పంచ్ పులి అశోక్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు పెండ్లి స్వామి, మండల యూత్ ఉపాధ్యక్షుడు గోణే హరిక్రిష్ణ, నాయకులు గాదరి బాబు, పులి శోభన్, బక్కం రాజిరెడ్డి, పొన్నాల మహేశ్వర్, నాగరాజు, శ్రీను, ఎర్ర రాజు, మహేశ్వర్ పాల్గొన్నారు.
- Advertisement -