Monday, December 23, 2024

పేదల ఆరోగ్యానికి భరోసా సిఎం రిలీఫ్ ఫండ్

- Advertisement -
- Advertisement -
  • కోహెడ ఫ్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు

కోహెడ: సిఎం రిలీఫ్ ఫండ్ పేదల ప్రజల ఆరోగ్యానికి భరోసా నిస్తుందని కోహెడ ఫ్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు స్ఫష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన 5గురు లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరి కాగా ప్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ… 5గురు లబ్ధిదారులకు మొత్తం 1 లక్ష 11 వేల రూపాయలు ప్ర భుత్వం ద్వారా సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ప్రత్యేక చొరవతో కోహెడ మండలంలోని పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు అవుతున్నాయని వెల్లడించారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కో సం పాటుపడుతుందని చెప్పారు. ఉపసర్పంచ్ యాద అశోక్, బిఆర్‌ఎస్ యువత మండల అధ్యక్షుడు జాలిగం శంకర్, మాజీ సర్పంచ్ దొమ్మాట జ గన్ రెడ్డి, నాయకులు బండ వెంకటస్వామి, కొయ్యడ పరుశరాములు గౌడ్, బబ్బురు శ్రీనివాస్ గౌడ్, బండ లక్ష్మణ్, ఉల్లెంగల లింగాచారి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News