సంగెం: నిరుపేదలకు ఆసరగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం సంగెం, గీసుకొండ, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన 25 మంది లబ్ధిదారులకు రూ. 11,16,000 చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎంతో మంది పేదలకు ఆసరగా నిలుస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు.
కేసీఆర్ పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సహాయ నిధి ద్వారా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వేలాది కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకున్నారన్నారు. సంగెం మండలానికి రూ. 5,39,500, గీసుకొండ మండలానికి రూ. 5,35,500, ఖిలా వరంగల్ మండలం 41,000 లబ్ధిదారులకు చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చింతం సదానందం, సంగెం మండలం బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సారంగపాణి, మాజీ ఎంపీసీలు వీరాచారి, కక్కెర్ల సదానందం, నాయకులు రడం భరత్, కిషోర్, మేర్గు వీరేశం, మొగిలి, పురుషోత్తం, పోశాల ప్రవీణ్‌తోపాటు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.