Wednesday, January 22, 2025

తెలియక ఆ ఇల్లు కొన్నా.. హైడ్రా నోటీసులపై సిఎం రేవంత్ సోదరుడు కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైడ్రా నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. తన ఇల్లు FTLలో పరిధిలో ఉంటే కూల్చేయండని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘2015లో మాదాపూర్ లోని అమర్‌సొసైటీలో ఇల్లు కొన్నాను.. కొనుగోలు సమయంలో FTL పరిధిలో ఉందనే సమాచారం లేదు. FTLలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు’ అని తెలిపారు.

కాగా.. దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నాలాలు, చెరువులను కబ్జాల నుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరంలో నాలాలను కబ్జా చేసి కట్టిన పలు కట్టడాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News