Wednesday, September 18, 2024

ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

- Advertisement -
- Advertisement -

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గురువారం ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేత జగదీశ్‌ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ కేసు విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం తెలిపింది.

సిఎం రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న 2015లో ఓటుకు నోటు కేసులో విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణకు చెందిన సహోద్యోగులను సంప్రదించి మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ బిఆర్ గవాయ్, పికె మిశ్రా, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News