Sunday, December 29, 2024

ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ఏర్పడి 10  సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ప్రభుత్వం వైభవంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా సీఎం సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపుతూ..”బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ… ఆ పిడికిలి విప్పిచూస్తే… త్యాగం… ధిక్కారం… పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో… ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ… “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం… ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని… విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News