Sunday, December 29, 2024

దావోస్ లో బిజీబిజీగా సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మంగళవారంనాడు ప్రపంచ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండ్ బోర్గ్, ఇథియోపియా ఉప ప్రధాని మెకనన్ తో సమావేశమయ్యారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఆరోగ్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ బుధవారం ప్రసంగిస్తారు.

నొవర్టిస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో రేవంత్ సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రితోపాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సిఎంఓ ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి, కాంగ్రెస్ యువ నేత కె. రఘువీర్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ తదితరులు పాల్గొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News