Sunday, December 22, 2024

రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ స్కీమ్ లను ప్రారంభించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సర్కార్ మరో రెండు గ్యారంటీలను ప్రారంభించింది. మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ తోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని మంగళవారం సచివాలయంలో మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. మాట ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకంజ వేయదు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలనేదే మా తపన. అందుకే ప్రజాపాలనలో దరఖాస్తులను తీసుకున్నాం. చేవేళ్లలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రెండు గ్యారంటీలను ప్రారంభించాలనుకున్నాం.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా అక్కడ లాంఛ్ చేయలేకపోయాం. పేదలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ దే. ఆనాడు దీపం పథకం కింద పేదలకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నాం” అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News