Sunday, December 22, 2024

చిక్కు’మూడు’ వీడేది నేడే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పెండింగ్ సీట్లకు సంబంధించి ఆయన ఏఐసిసి అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఇప్పటికే 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సీట్లకు సంబంధించి గురువారం ఏఐసిసి అగ్రనేతలతో సిఎం రేవంత్ చర్చించినట్టుగా తెలిసింది.

నేడు (శుక్రవారం) ఢిల్లీలో జరిగే సీఈసీ సమావేశంలో ఈ మూడు సీట్ల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండడంతో సి ఎం రేవంత్ ముందస్తుగా అభ్యర్థుల గురించి ఏఐసిసి అగ్రనేతలు, సీఈసీ సభ్యులతో చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపా టు ఢిల్లీలో ఓ మీడియా ఇంటర్వూ ఉండడంతో సిఎం రేవంత్ గురువారం ఢిల్లీకి వెళ్లినట్టుగా స మాచారం. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను శరవేగంగా ఎంపిక చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు సీట్ల విషయంలో అభ్యర్థుల ఎంపికకు తీవ్రంగా శ్రమిస్తోంది.

రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గాను ఇప్పటికే 14 స్థా నాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టింది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కుల సమీకరణలు అత్యంత కీలకమైనవని కావడంతో ఆ చితూచి వ్యవహరిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ఈ మూడు స్థానాల అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించేందు కు పిసిసి చీఫ్, సిఎం రేవంత్‌రెడ్డి గురువా రం ఢిల్లీకి వెళ్లడంతో అభ్యర్థుల ఎంపికపై ఎవరికీ ఆ సీట్లు దక్కుతాయోనని ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న భావన నాయకుల్లో ఏర్పడింది. దాంతో ఆ నియోజకవర్గానికి పోటీ ఎక్కువయ్యింది. స్థానికంగా బలమైన నాయకులే కాకుండా స్థానికేతర నాయకులు కూడా ఆ సీటు కోసం అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. టికెటిస్తే చాలు గెలుస్తామన్న ధీమా ఆశావహుల్లో నెలకొంది. జిల్లాకు చెందిన బలమైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా ఈ టికె ట్ ఆశిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భ ట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తు మ్మల నాగేశ్వర్ రావు కుమారుడు యుగంధర్ టి కెట్‌ను ఆశించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

వి.హనుమంత రావు, ఓ టివి చానల్ యజమాని కుమార్తె రచన, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని వంటి నాయకులు కూడా పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చారు. అయితే, అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆలస్యమవుతున్న క్రమంలో పలువురు ఆశావహులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా తెరమీదికి కొత్త పేరు రావడం గమనార్హం. కమ్మ కులానికి చెందిన నిజామాబాద్ నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

తన చిరకాల మిత్రుడైన వెంకటేశ్వర రావుకు టికెట్ ఇప్పించడానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వివాదరహితుడు, అన్ని వర్గాలతో సంబంధాలున్న వెంకటేశ్వర రావు అయితే విజయబావుటా ఎగురవేస్తాడనే ఆలోచనలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఖమ్మం టికెట్ కమ్మ సామాజిక వర్గానికా, రెడ్డికా, లేదా ఎస్సీ (మాల) కులానికా అన్నది ఈ రెండు రోజుల్లో తేలే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కరీంనగర్ టికెట్ వెలమకా, మున్నూరుకాపులకా..?
బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు బలంగా ఉన్న కరీంనగర్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపిల మధ్యనే పోటీ నెలకొనడంతో చివరకు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. ఈ సారి కరీంనగర్‌లో ఎలాగైనా పాగా వేయాలన్న ఉత్సాహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అభ్యర్థిని ఎంపిక చేయడానికి అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న ఏఐసిసి కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకలుతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌ను ఓడించాలంటే అదే కులానికి (మున్నూరు కాపు)కు చెందిన వ్యక్తిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలని కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది.

ముఖ్యంగా వెలిశాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు తీన్మార్ మల్లన్న పేరును కూడా పరిశీలించాలని ఇప్పటికే ఏఐసిసి విజ్ఞప్తి వెళ్లినట్టుగా తెలిసింది. అయితే ఈ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్నీ తానై ప్రచారం చేస్తుండడం విశేషం. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపికలో ఆయన పాత్ర కూడా కీలకంగా మారింది. ఖమ్మం సీటును కమ్మ కులం వారికి ఇస్తే, కరీంనగర్ అభ్యర్థిగా వెలమ కులం నాయకుడికి ఇవ్వవచ్చన్న వాదన ఉంది. కనీసం తమ కులానికి ఒక్క పార్లమెంటు సీటు ఇవ్వరా అని వెలమ కుల నాయకులు అధిష్టానం పెద్దలపై ఒత్తిడి తెస్తుండడం విశేషం.

హైదరాబాద్ నుంచి బిసి అభ్యర్థియేనా..!
హైదరాబాద్ ఎంపి సీటు అభ్యర్థి ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోంది. ఎంఐఎం పార్టీతో స్నేహపూర్వక బంధాన్ని నెరపాలని తెలంగాణ కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎంఐఎం పార్టీ నేతలు కూడా అదే వైఖరిని అవలంభిస్తూ క్రమంగా బిఆరెస్ కు దూరం జరుగుతున్నారు. బిజెపి అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని ఎంఐఎం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరపున బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలో ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్‌లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ బిసి అభ్యర్థిని బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే పలువురు ముస్లిం నాయకుల పేర్లు పరిశీలనకు వచ్చినా వాటిని పక్కనబెట్టి బిసి అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News