Monday, December 23, 2024

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను, స్పీకర్ గడ్డం ప్రసాద్‌లను పరామర్శించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలి ఎఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని సిఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సిఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర సిపిఎం నాయకులు ఉన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను పరామర్శించిన సిఎం
అనారోగ్యంతో బాధపడుతున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సిఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని సిఎం ఆకాంక్షించారు.

CM meets speaker Gaddam Prada

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News