Wednesday, December 25, 2024

అల్లు అర్జున్ విషయంలో ఎవరూ మాట్లాడొద్దు.. పార్టీ నేతలకు సిఎం రేవంత్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడొద్దని సిఎం రేవంత్ ఆదేశించారు. పార్టీ నాయకులు కూడా మాట్లాడకుండా పిసిసి చూడాలన్నారు. మీడియా సమావేశాలు, చర్చల్లో అల్లు అర్జున్ విషయంలో  నోరు మెదపవద్దని సూచించారు. కాగా, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన హీరో బన్నీని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వెంటనే హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సద్దుమనిగిందనుకున్న సమస్యను సిఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో అల్లుఅర్జున్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ రాజుకుంది.

సిఎం వ్యాఖ్యలకు బన్నీ ప్రెస్ మీట్ పెట్టి.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్ మంత్రులు, నేతలు.. అల్లుఅర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత కొంతమంది ఓయూ జేఏసీ పేరిట అల్లుఅర్జున్ ఇంటిపై దాడి చేశారు. దీంతో అప్పటివరకు బన్నీపై ఉన్న కొంత వ్యతిరేకత.. దాడి ఘటనతో ఆయనకు మద్దతు పెరిగింది. ఈ ఘటనపై జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. కాంగ్రెస్ నాయకులు, సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో సిఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయి.. ఈ విషయంలో ఎవరూ మాట్లాడొద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News