Wednesday, January 22, 2025

బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2కోట్ల చెక్కును అందచేసిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో బాక్సర్ నిఖత్ జరీన్‌కు రెండు కోట్ల రూపాయల చెక్‌ను సిఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. పారిస్ ఒలింపిక్ శిక్షణ కోసం ఈ మొత్తాన్ని ఆమెకు అందించారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇటీవలే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి ఆమె అదరగొట్టారు. దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

నిఖత్ జరీన్‌ది సాధారణ మధ్య తరగతి కుటుంబం
నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్‌ది సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆడపిల్లకు ఇలాంటి ఆటలేంటి అంటూ అవమానాలను భరించింది. వాటిని దాటుకొని ప్రపంచానికి తన సత్తా చాటింది నిఖత్ జరీన్. చిన్నతనం నుంచే బాక్సింగ్‌పై ఆమె మక్కువ పెంచుకుంది. భారత బాక్సింగ్ కేరాఫ్ నిఖత్ అన్నట్లుగా మారింది. తాజాగా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News