తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో ఎవరుండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని…తాను ఎవరి పేరును ప్రతిపాదించలేదని చెప్పారు.అయినా ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.
“నాకు రాహుల్ గాంధీకి ఎలాంటి విబేధాలు లేవు. మేము చాలా సన్నిహితంగా ఉంటాము. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తాం. త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయాలనే ఆలోచన మాకు లేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కులగణన సర్వే చేశాం. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయింది. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వస్తుంది” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.