- Advertisement -
హైదరాబాద్: దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం సిఎం రేవంత్ మాట్లాడుతూ.. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని చెప్పారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామని.. కులగణన విషయంలో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని.. వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాగా, కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికను తెలంగాణ కేబినెట్ ఆమోదించింది.
- Advertisement -