Tuesday, January 7, 2025

ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలిచ్చాం.. ఇది దేశంలోనే రికార్డు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తర్వాత ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని.. తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని చెప్పారు. ఆదివారం ప్రజాభవన్‌లో సివిల్స్‌ మెయిన్స్‌ కు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సివిల్స్ ఇంటర్వ్యూకి ఎంపికైన 20 అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సీఎం రేవంత్ చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం.. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ అన్యాయం జరిగిందనే పరిస్థితి ఏర్పడింది. పదేళ్లలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. గతంలో ఎన్నడూ 563 గ్రూప్‌ 1 ఉద్యోగాలు ఇవ్వలేదు. 14 ఏళ్లుగా వీటి నియామకాలు చేపట్టలేదు. ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేక అడ్డుకునే కుట్ర చేశారు. గ్రూప్‌ 1పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించాం. ఈ విషయంలో కోర్టులు ప్రభుత్వానికి అండగా నిలిచాయి. మార్చి 31 లోపు ఈ నియామకాలు పూర్తి చేస్తాం. తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్నా రాష్ట్రం కోసం కృషి చేయాలి. మా ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. ఇది దేశంలోనే రికార్డు” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News