Sunday, January 12, 2025

రాజకీయాలు పక్కన పెట్టి.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అందరూ రావాలి: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ తల్లికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదని చెప్పారు. తెలంగాణ తల్లి అంటే భావన కాదని.. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగమని అన్నారు. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సచివాలయంలో జరుపుకోబోతున్నామన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ తల్లి  అని సీఎం రేవంత్ అన్నారు.

“సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తాం.. కేసీఆర్, కిషన్ రెడ్డి, అసదుద్దీన్ సహా కమ్యూనిస్ట్ నేతలకు ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ విగ్రహావిష్కరణకు రావాలి” అని సీఎం రేవంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News