Monday, December 23, 2024

భావోద్వేగాలే బ్రహ్మాస్త్రాలు

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల కు మరో రెండు వారాలే గడువు ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు రోజుకో సున్నితమైన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ప్రజల్లో తీవ్ర చర్చ లేపుతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతూ ఓటర్లను ఆకర్షించే ప్ర యత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ వంటి అం శాలను బిఆర్‌ఎస్ లేవనెత్తడంతోపాటు రుణమాఫీపై కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. తాజాగా రిజర్వేషన్లు రద్దు అంశాన్ని కాం గ్రెస్ తెరపైకి తీసుకువచ్చింది. రిజర్వేషన్ల రద్దు అం శాన్ని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా పరిగణించి కౌం టర్ ఇస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కీలక వ్యాఖ్యలు చేశా రు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకునే శక్తి బిఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే ఉందదని సంచలనం వ్యాఖ్యానించారు. ఇలా ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన రోజుకో సున్నితమైన అంశంతో రాష్ట్ర రాజకీయాలు వేడుకుతున్నాయి.

దేశంలో రిజర్వేషన్లపై కాంగ్రెస్, బిజెపిలపై ప్రజల్లో వాడీ వేడి చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా దేశాన్ని రిజర్వేషన్ల రహిత దేశంగా చేయాలనేదే బిజెపి లక్ష్యమని ఆరోపించిన విషయంలో తెలిసిందే. దీనితో పా టు 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి వందేళ్లవుతుందని, అప్పటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేష న్లు రద్దు చేయాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని సంచల న వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేయడానికి కుట్ర చేస్తోందని మండిపడ్డారు. 400సీట్లు సాధించడం ద్వారా రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడిచేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల క్షేత్రంగా దేశ మూలవాసులైన ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించా రు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువులు ఏకతాటి మీదకు రారనీ, రిజర్వేషన్లు రద్దు చేస్తే, హైందవులంతా ఒకటే అనే భావన కలుగుతుందని ఆ పార్టీ భావిస్తోందన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు.

ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కలిసి రిజర్వేష న్లు తీసేయాలని కుట్రలు చేస్తున్నాయని హస్తం పా ర్టీ నాయకులు ఆరోపిస్తున్న తరుణంలో ఆర్‌ఎస్‌ఎస్ చీ ఫ్ మోహన్ భగవత్ స్పందించారు. తమపై జరుగుతు న్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనన్నారు.ఈ నేపథ్యంలో బిజెపి ఎన్నికల్లో గెలిస్తే రిజర్వేషన్లు తొలిగిస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంస్థ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. హస్తం పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వేళ తమపై తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సమాజంలో భేదభావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాను మంచి కోసమే ఉపయోగించాలని హితవు పలికారు.

మళ్లీ తెరపైకి హైదరాబాద్ అంశం
లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వేములవాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా అడ్డుకోగలుతామని, డీలిమిటేషన్‌లో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి బిఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు. 12 స్థానాల్లో గెలిపిస్తే.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, బిజెపి భారత రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకొగలగుతామని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేసే అరాచకాలను అడ్డుకోవాలంటే.. బిఆర్‌ఎస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించాలని అన్నారు.

రుణమాఫీపై కాంగ్రెస్, బిఆర్‌ఎస్ సవాళ్లు
ఎండాకాలంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బిఆర్‌ఎస్ మధ్య సవాళ్లు- ప్రతిసవాళ్లు మంటలు రేపుతున్నాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సిఎం రేవంత్ రెడ్డి మధ్య రుణమాఫీకి సంబంధించిన మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్న సిఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై బిఆర్‌ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారి తీసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సిఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఇటీవల హరీశ్ రావు గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి మరోసారి సవాల్ చేశారు. హరీశ్‌రావు అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి మలినం చేశారని పేర్కొంటూ హస్తం పార్టీ నేతలు పసుపు నీళ్లతో అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు అమరవీరులకు నివాళులర్పిస్తూ చల్లిన పూలను కాంగ్రెస్ నేతలు చిందరవందరగా ఊడ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News