Tuesday, January 21, 2025

రూ.600కోట్ల లూటీకి యత్నం

- Advertisement -
- Advertisement -

ఈకారు రేసులో అవినీతిపై బిఆర్‌ఎస్ కార్యాలయంలోనైనా
చర్చకు రెడీ రేసింగ్ నిర్వాహకులతో కెటిఆర్
రూ.600 కోట్ల ఒప్పందం కార్ రేసింగ్ కంపెనీ ప్రతినిధులు
వచ్చి నన్ను కలిసిన మాట నిజమే మిగతా డబ్బుల కోసం
వాళ్లు నన్ను అడిగినప్పుడే ఆ విషయం తెలిసింది
హెచ్‌ఎండిఎ ఖాతాలోనుంచి లండన్‌లోని కంపెనీకి నిధులు
మళ్లాయి విదేశీ కంపెనీకి పౌండ్‌లలో చెల్లింపులు చేశారు
కారు రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని కెటిఆర్
ఇప్పుడెందుకు డిమాండ్ చేస్తున్నారు? అసెంబ్లీలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్

ఫార్ములా ఈ కార్ రేసులో రూ. 600 కోట్లు లూటీ చేసేందుకే కెటిఆర్ కుట్రలు చేశారని దానిని తాము అడ్డుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేస్‌పై రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఎండిఏ నిధులు విదేశాలకు ఎలా వెళతాయని ఆయన ప్రశ్నించారు. ఈ కార్ రేస్ సంస్థతో కెటిఆర్‌కు లోపాయికారీ ఒప్పందం జరిగిందన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ ప్రతినిధి తమను కలిశారని, రూ.600 కోట్ల పెండింగ్ నిధులు తెలంగాణకు రావాల్సి ఉందని, వాటిని చెల్లించమని తమను అడిగారని సిఎం వెల్లడించారు. మీరు ఊ అంటే మరోసారి ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తామని నిర్వాహకులు తనతో పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఎఫ్‌ఈఓ సంస్థ ప్రతినిధులు తనను కలిసిన తర్వాతే ఈ స్కాం బయటకు తీశామని రేవంత్ అన్నారు. మిగతా డబ్బుల కోసం వాళ్లు తన దగ్గరకు వచ్చినప్పుడే అసలు విషయం తన దృష్టికి వచ్చిందని,వెంటనే తాను జాగ్రత్త పడ్డానని సిఎం తెలిపారు.

ఫార్ములా ఈ రేస్‌పై ఏసిబి విచారణ జరుగుతుందని అందుకే పూర్తిగా మాట్లాడటం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. 2023 డిసెంబర్, 2024 డిసెంబర్ వరకు ఏసిబి విచారణకు ముందు వివరాలు అన్ని త్వరలోనే బయట పెడతానని రేవంత్ చెప్పారు. హెచ్‌ఎండిఏ ఖాతాలోని నిధులు నేరుగా లండన్‌లోని కంపెనీకి ఎలా వెళ్తాయని సిఎం రేవంత్ ప్రశ్నించారు. నాలుగు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయని ఎప్పుడైనా బిఆర్‌ఎస్ ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడిందా అని ఆయన ప్రశ్నించారు. కెటిఆర్ ట్విట్టర్ పిట్ట ఎప్పుడైనా దీనిపై స్పందించారా సడెన్ గా గురువారం చర్చ పెట్టాలని రాద్ధాంతం చేయడం ఎందుకని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఈ కార్ రేసుపై అసెంబ్లీలో కాదు, బిఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులోనైనా చర్చకు రెడీ అని రేవంత్ సవాల్ విసిరారు. రూ.55 కోట్లు చిన్న అమౌంటా? మేం ఒప్పుకోకపోవడం వల్లే ప్రభుత్వం రూ.600 కోట్ల నష్టపోకుండా ఆపగలిగామని ఆయన తెలిపారు.

ఔటర్ రింగ్‌రోడ్డు అమ్ముకున్నా, హెచ్‌ఎండిఏ నిధులను బదిలీ చేసినా…
డ్రగ్స్‌తో పట్టుబడితే ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని కెటిఆర్ దబాయిస్తున్నారని, మనం ఏ సంప్రదాయంలో ఉన్నామని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఔటర్ రింగ్‌రోడ్డు అమ్ముకున్నా, హెచ్‌ఎండిఏ నిధుల నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమీ అనొద్దు అన్నట్లుగా బిఆర్‌ఎస్ తీరు ఉందని ఆయన ఆరోపించారు. ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తామనే తీరుగా బిఆర్‌ఎస్ ప్రవర్తన ఉందని ఆయన అన్నారు. దీనిని ప్రభుత్వం ఏ మాత్రం సహించదన్నారు. మీరు కూడా (స్పీకర్ ఉద్ధేశించి) కొరడా ఝుళిపించాల్సిన సమయం వచ్చినట్టుందని అధ్యక్షా అని సిఎం రేవంత్ తెలిపారు. హరీష్ రావు పరిస్థితి తమకు అర్ధమైందని చొక్కాలు చించుకోకపోతే ఇంటి దగ్గర మామతో కొరడా దెబ్బలు ఉంటాయని, ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాలని, మరీ మామకు అంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News