Tuesday, December 24, 2024

ప్రధాని మోడీ కలిసిన సీఎం రేవంత్, భట్టి విక్రమార్క ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు భేటీ అయ్యారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీని కలిసేందుకు మంగళవారం రేవంత్, భట్టిలు ఢిల్లీకి చేరుకున్నారు. పిఎం అధికారిక నివాసంలో మోడీతో సమావేశమై.. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే.. విభజన హామీలు, అభివృద్ధి ప్రాజెక్టులు, రాష్టానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా ప్రధాని మోడీతో చర్చించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News