Thursday, January 23, 2025

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం, మాజీ సిఎం

- Advertisement -
- Advertisement -

రంజాన్ పండగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలను పండగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని సిఎం కోరారు. వంద రోజుల్లో పాతబస్తీలో మెట్రోకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెంచామని సిఎం పేర్కొన్నారు. అటు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా ముస్లింలకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు జరిగిన ఉపవాస దీక్షలు ఆధ్యాత్మిక వాతావరణం నింపాయని కెసిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News