Wednesday, January 22, 2025

రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో సిఎం రేవంత్, షర్మిల

- Advertisement -
- Advertisement -

జనవరి 14 ఆదివారం మణిపూర్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. మొదటి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న తర్వాత రేవంత్ ఢిల్లీకి తిరిగి వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దావోస్ వెళతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రేవంత్ రెడ్డి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు పలువురు పరిశ్రమల ప్రముఖులతో సమావేశమై తెలంగాణను ఆదర్శవంతమైన పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దనున్నారు. త్వరలో ఇంఫాల్ నుంచి ప్రారంభమై 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలు, 110 జిల్లాల్లో 6,713 కిలోమీటర్ల మేర సాగనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు తెలంగాణ సీఎం మద్దతు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News