Thursday, January 16, 2025

నేడు డిఎస్‌సి అభ్యర్థులకు సిఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత

- Advertisement -
- Advertisement -

11,062 పోస్టులకు 10,006 పోస్టులు భర్తీ
కోర్టు కేసుల కారణంగా
1,056 పోస్టుల భర్తీ నిలిపివేత

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డిఎస్‌సి 2024 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం(అక్టోబర్ 9) ఎల్.బి.స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్‌సి నిర్వహించగా, జిల్లాల వారీగా 1:3 నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అందులో 10,006 మంది అభ్యర్థులను ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేయగా, కోర్టు కేసుల కారణంగా 1,056 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకాలను నిలిపివేశారు. డిఎస్‌సి 2024లో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా విద్యాధికారి కార్యాలయాల నుంచి ఫోన్లు చేసి సమాచారం అందజేశారు. మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో బుధవారం ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు.

అభ్యర్థులందరూ మధ్యాహ్నం 2 గంటలలోపే ఎల్. బి. స్టేడియంకు చేరుకునేలా తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని ఇప్పటికే సిఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను హైదరాబాదుకు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అంద చేసేందుకు గాను జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సాయంత్రం 4 గంటలకు ఎల్.బి.స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News